పోలీస్ స్టేషన్ వరదలో మునిగింది

భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాల్లో జన జీవనం అస్తవ్యస్తమవుతోంది. పాల్గర్ జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి స్థానిక తులింజి పీఎస్ లోకి వరద నీరు భారీగా చేరింది. స్టేషన్ లోని అన్ని గదుల్లోనూ వరద నీరు నిండిపోయింది. పోలీసులు తమ విధులు నిర్వర్తించలేక ఇబ్బందులు పడుతున్నారు. ముంబై నగరమంతా వర్షాలతో తడిసిముద్దవుతుండడంతో.. రాష్ట్ర ప్రభుత్వం నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. నగరంలోని సియాన్ రైల్వే స్టేషన్ లో రైల్వే ట్రాకులు  వరదనీటితో మునిగిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. Tulinj Police Station in Palghar district flooded, following heavy rainfall.

Latest Updates