మనం మాట్లాడే పరిస్థితిలో లేం..కేసీఆరే సరిదిద్దాలి

ఖమ్మం, వెలుగు: ‘ఇక్కడి రాజకీయ పరిస్థితులు మీరందరూ చెప్పారు. నేనూ విన్నాను, చూస్తున్నాను. కానీ పార్టీ లైన్​ తప్పి నేను మాట్లాడడానికి అవకాశం లేదు. పరిస్థితులను కేసీఆరే సరిదిద్దాలి. ఆయన సరిదిద్దే వరకు మీరు ఓపికతో ఎదురు చూడాలి’ అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యకర్తలతో అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ప్రస్తుతం తుమ్మల, కందాల వర్గాలుగా కార్యకర్తలు విడిపోయారు. సహకార ఎన్నికల్లో తుమ్మల వర్గానికి చెందిన రామసహాయం నరేష్​రెడ్డి, ఎమ్మెల్యే కందాల వర్గానికి చెందిన వనవాసం వెంకటరెడ్డి పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా నరేష్​ రెడ్డికి మద్దతుగా ఆయన నివాసంలో తుమ్మల గురువారం కార్యకర్తలతో సమావేశమయ్యారు. టీఆర్ఎస్​ అభ్యర్థులను, పార్టీని గెలిపించాలని కోరారు. పార్టీకి ద్రోహం చేసేవారిని క్షమించవద్దన్నారు. బీరోలు సొసైటీ పరిధిలో ఎక్కువ మంది డైరెక్టర్లను టీఆర్‍ఎస్‍గెలుచుకుని నరేష్‍రెడ్డి నాయకత్వంలో పని చేయాలని కోరారు.

Latest Updates