ముగిసిన తుంగభద్ర పుష్కరాలు

తుంగభద్ర పుష్కరాలు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజు జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్, పుల్లూ రు, రాజోలి, వేణిసోంపురం ఘాట్ లలో వేలాదిమంది పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. 12 రోజుల్లో దాదాపు 6 లక్షల మంది పుణ్య స్నానాలు చేసినట్టు అధికారులు అంచనా వేశారు

పవిత్ర తుంగభద్ర పుష్కరాలు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా లోని అలంపూర్, పుల్లూ రు, రాజోలి, వేణిసోంపురం ఘాట్ లలో వేలాదిమంది పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం పూట
అలంపూర్ ఆలయ చైర్మన్ రవిప్రకాష్ గౌడ్, ఈవో ప్రేమ్ కుమార్, ధర్మకర్తలు వెంకటరామయ్యశెట్టిలు అర్చకులతో కలసి తుంగభద్రమ్మకు పూజలు నిర్వహించి నదీజలాలు తెచ్చి స్వామివారికి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.

సాయంత్రం నదీమతల్లికి మహామంగళ నీరాజనం, వాయనం, పట్టు వస్త్రా లు సమర్పించడంతో పుష్కరాలు ముగిశాయి. తుంగభద్ర పుష్కరాలు కిందటి నెల 20 న ప్రారంభం కాగా మంగళవారం సాయంత్రం నాటికి దాదాపు 6 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, కలెక్టర్ శృతి ఓజా తదితర అధికారులు నదీమ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అలంపూర్, వెలుగు.

for more News..

పుష్కర స్నానాలకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి

ఓటేయనోళ్లకు సర్కారు స్కీమ్‌‌లు ఇవ్వొద్దు

Latest Updates