తూనీగ మూవీ ఆడియో విడుదల

Tuniga movie audio release function

వినీత్ చంద్ర, దేవ‌యానీ శ‌ర్మ జంటగా న‌టించిన తూనీగ సినిమా ఆడియో వేడుక  రామానాయుడు స్టూడియోస్ లో  సోమవారం ఘనంగా జ‌రిగింది. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి,మాటల ర‌చ‌యిత మ‌రుధూరి రాజా ఈ ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  వేడుకలో రాజ్ కందుకూరి మాట్లాడుతూ..ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.ఇటీవ‌ల విడుద‌ల‌యిన చిన్న చిత్రాలన్నీ బాక్సాఫీసుకు బొనాంజాగా నిలిచాయ‌ని, అదే క్ర‌మంలో ఈ సినిమా చేరాల‌న్న‌ది త‌న అభిమ‌తం అన్నారు. సీనియ‌ర్ డైలాగ్ రైట‌ర్ మ‌రుధూరి రాజా మాట్లాడుతూ.. ఉత్త‌రాంధ్ర అంటే ఉద్య‌మాల గ‌డ్డ అని, అలాంటి నేల నుంచి వ‌చ్చిన ద ర్శ‌కుడు ప్రేమ్ సుప్రీమ్  ఈ చిత్రం కోసం ఎంతో క‌ష్టించార‌ని, ఎన్నో అవ‌స్థ‌లూ, ఆటుపోట్లూ ఎదుర్కొ న్నార‌ని, ఈ వేళ ఈ స్వ‌రాల పండుగ‌లో ఆ క‌ష్టం అంతా మ‌రిచి,తొలి ప్ర‌య‌త్నంతోనే విజ‌యం సాధించాల‌ని దీవించారు.

డైరెక్ట‌ర్ ప్రేమ్ సుప్రీమ్ మాట్లాడుతూ.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి స్ఫూర్తితో ఏడాది కింద‌ట ఈ చిత్రాన్ని తీశానని, చిత్రాన్ని క్రౌడ్ ఫండింగ్ తో సినిమాను పూర్తి చేశానని చెప్పారు. హీరో వినీత్ చంద్ర తో స‌హా ఇత‌ర న‌టీన‌టులు వారి వారి అనుభవాలను ఈ వేడుక ద్వారా పంచుకున్నారు. కార్య‌క్రమం లో సంగీత ద‌ర్శ‌కులు సిద్ధార్థ్ స‌దాశివుని, సినిమాటొగ్ర‌ఫర్ హ‌రీష్ ఎదిగ, పోస్ట‌ర్ డిజైన‌ర్ ఎంకేఎస్ మ‌నోజ్, ప్రోమో డైలాగ్, లిరి కల్ వీడియోస్ ఎడిట‌ర్ నికిల్ కాలేపు, పాట‌ల ర‌చ‌యిత‌లు కిట్టు, ఫ‌ణి , గాయ‌కులు క‌రీముల్లా, విశ్వ‌,ఇషాక్, స‌హ నిర్మాత క‌ర్రి ర‌మేశ్, న‌టీన‌టులు సిల్వ‌ర్ సురేశ్, చైత్రిక, త‌దిత‌ర యూనిట్ స‌భ్యులు  పాల్గొన్నారు.

Latest Updates