కొడుకంటే ఇష్టం లేదు.. అందుకే చంపేశా

  • ఐదేళ్ల బాలుడ్ని హతమార్చిన ఫుట్ బాల్ ప్లేయర్

అంకారా(టర్కీ): ఇష్టం లేని కారణంగా తన కన్న కొడుకునే అతి కిరాతకంగా చంపేశాడు ఓ ఫుట్​బాల్ ప్లేయర్. టర్కీలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా బయటపడింది. సెవెర్ టోక్టాస్(32) టర్కీ ఫుట్ బాల్ టీమ్​లో ప్లేయర్. అతని ఐదేళ్ల కొడుకు ఖాసిమ్​కు దగ్గు, జలుబు, జ్వరం రావడంతో నార్త్‌ వెస్ట్రన్‌ ఫ్రావిన్స్‌లోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. పిల్లవాడికి, తండ్రి టోక్టాస్ కి కరోనా టెస్టులు చేయగా ఇద్దరికీ నెగిటివ్ వచ్చింది. అయితే కరోనా లక్షణాలు బయటపడే అవకాశాలు ఉండొచ్చన్న కారణంతో తండ్రితో పాటే ఖాసీమ్‌ను కూడా ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ నెల 4న ట్రీట్​మెంట్​లో ఉన్న చిన్నారి ఖాసిమ్​ను.. టోక్టాస్ దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆ తర్వాత తనకేమీ ఎరుగనట్టుగా డాక్టర్లను పిలవడంతో వారు ఖాసిమ్ ను ఐసీయూకి తరలించినా ఫలితం లేకపోయింది. బాలుడి మరణంపై ఎవరికీ అనుమానం రాలేదు.

ఈ దారుణం జరిగిన పది రోజుల తర్వాత పశ్చాత్తాపంతో సెవెర్ టోక్టాస్ పోలీసులకు లొంగిపోయి అసలు విషయం బయటపెట్టాడు. ‘‘చిన్నారి మొహంపై దిండుతో 15 నిమిషాల పాటు గట్టిగా ఒత్తిపట్టి ఊపిరి ఆడకుండా చేశాను. కొద్దిసేపట్లోనే కదలికలు ఆగిపోయాయి. డాక్టర్లను పిలవడంతో ఎవరికీ అనుమానం కలగలేదు. ఖాసిమ్ అంటే ఫస్టు నుంచే నాకిష్టం లేదు. అందుకే చంపేశాను”అని పోలీసులతో చెప్పాడు. దీంతో పోలీసులు.. చిన్నారి డెడ్​బాడీని బయటకు తీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. టోక్టాస్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Latest Updates