బరువు తగ్గిస్తదట పసుపు!

చిటికెడు పసుపు వేస్తేనే కూరకి రంగుతో పాటు రుచీ వస్తుంది. అంతేకాదు  పసుపులో ఉండే కుర్కుమిన్ అనే పదార్థంలో యాంటీ ఇన్‌‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌‌తో పాటు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే గుణాలున్నాయి. పసుపు ‘టీ’ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పసుపు  సహజ సిద్ధమైన యాంటీ బయాటిక్‌‌గా పనిచేస్తుంది. గాయాలను, పుండ్లను త్వరగా మానేలా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు  శరీరాన్ని ఇన్‌‌ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తాయి. అందుకే క్రమం తప్పకుండా పరగడుపున ఒక గ్లాస్ పసుపు టీ తాగాలి.

నొప్పులు మాయం

పరగడుపునే పసుపు టీ తాగితే రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది. షుగర్​ అదుపులో ఉంటుంది. పసుపులో ఉండే కుర్కుమిన్​  వల్ల  కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. నెలసరిలో విడుదలయ్యే హార్మోన్ల  ఫలితంగా వచ్చే  పొత్తి కడుపు నొప్పితో పాటు ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

శరీరాన్ని శుద్ధి చేస్తుంది

రోజూ ఉదయాన్నే పసుపు నీళ్లు తాగితే శరీరంలో ఉండే  వ్యర్థాలు బయటికి పోతాయి. శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. పసుపులో ఉండే కుర్కుమిన్ (ఫ్రీరాడికల్స్) ను తొలగించి, స్కిన్ ఇన్​ఫ్లమేషన్ దూరం చేయడం వల్ల ఏజింగ్ సమస్యలుండవు.

అధిక బరువు

పసుపుని గోరు వెచ్చని నీళ్లలో కలుపుకుని తాగితే అధిక బరువు సమస్య నుంచి బయటపడొచ్చు.   రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది. దీనివల్ల  జలుబు, ఫ్లూలాంటి వైరస్​లు,  అంటువ్యాధులు త్వరగా వ్యాపించవు. పసుపు నీళ్లు తాగడం వల్ల జీర్ణశక్తి కూడా మెరుగపడుతుంది. ఎసిడిటి లక్షణాలు దరిచేరవు. లివర్​ని డ్యామేజ్ చేసే టాక్సిన్స్ తొలగించడంలో పసుపు సాయపడుతుంది.

హార్ట్ హెల్త్

ఆల్కలైన్ నేచర్ కలిగి ఉండటం వల్ల పసుపు శరీరంను ఆల్కలైజ్ చేస్తుంది. రీసెంట్​గా జరిపిన పరిశోధనల ప్రకారం పసుపు నీళ్లు రెగ్యులర్​గా తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్​ను నివారించొచ్చని తేలింది. పసుపులో ఉండే కుర్కుమిన్ హార్మోన్స్​ను బ్యాలెన్స్ చేసి, మతిమరుపు వంటి లక్షణాలను నివారిస్తుంది. ఏజ్ రిలేటెడ్ బ్రెయిన్ ఫంక్షన్స్ లోపాలను, బ్రెయిన్ డిసీజెస్​ను నివారిస్తుంది. అలాగే పసుపులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గుండె జబ్బులని  కూడా దరిచేరనివ్వవు. పసుపులో  క్యాన్సర్‌‌తో పోరాడే గుణాలు కూడా అధికంగా ఉన్నాయి. క్యాన్సర్‌‌కి సంబంధించిన ట్యూమర్ల పెరుగు దలను, క్యాన్సర్ కణాల విస్తరణను కుర్కుమిన్ అడ్డుకుంటుందని పరిశోధనల్లో తేలింది.

చర్మ సౌందర్యానికి

ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు స్వచ్ఛమైన పసుపుని, పాలతో కలిపి ఒంటికి పట్టించి స్నానం చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వారానికి ఒకసారి ఒక స్పూన్ పసుపు పొడి తీసుకుని అందులో కొద్దిగా ఆముదం కలిపి శరీరానికి పట్టించాలి. ఇలా చేస్తే శరీరంపై ఉన్న మచ్చలు, దురద, చర్మవాధుల లాంటివి కూడా తగ్గిపోతాయి. పసువు, వేపాకు కలిపి నూరిన ముద్దను శరీరానికి పూసుకుంటే కూడా దురదలు తగ్గుతాయి. ఎక్కువ సేపు నీళ్లలో నానితే పాదాలు పగులుతాయి. అప్పుడు పసుపు రాసుకుంటే పగుళ్లను తగ్గిస్తుంది.

Latest Updates