పసుపు లోడ్ తో వెళ్తున్న లారీకి అగ్ని ప్రమాదం..

నిజామాబాద్: పసుపు లోడ్ తో వెళ్తున్న లారీ అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటన గురువారం పొద్దున.. నిజామాబాద్ జిల్లా  ముప్కాల్ మండలంలోని కొత్తపల్లి దగ్గర జరిగింది. దీంతో లారీ పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సుధాకర్,  క్లీనర్ అజయ్‌లు గాయపడ్డారు. వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పసుపు లోడ్ తో వెళ్తున్న లారీ డిజిల్ ట్యాంకర్ పేలడంతో మంటలు వ్యాపించినట్లు తెలిపారు. లారీలో మొత్తం 350పసుపు సంచులు ఉన్నట్లు చెప్పారు. ఒక్కో సంచి విలువ ఐదు వేల రూపాయలు ఉంటుందని పసుపు రైతులు తెలిపారు. లారీ మెండోరా వెల్గటూర్ నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుకు పసుపును తరలిస్తుండగా ప్రమాదం జరిగింది.

Latest Updates