తక్కువ ఖర్చుతో సైకిల్ ని ఎలక్ట్రిక్ బైక్ గా మార్చి..

తక్కువ ఖర్చుతో సైకిల్ ని ఎలక్ట్రిక్ బైక్ గా మార్చి..

పొల్యూషన్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి ఆల్టర్నేటివ్ ఐడియాస్ చాలా ఉన్నయ్. వాటిని ప్రాక్టీస్ లోకి తీసుకొచ్చి ఎన్విరాన్మెంట్ ని కాపాడేందుకు ఎన్నో ఇన్నోవేషన్స్ చేస్తున్నారు. లాభం కన్నా సామాన్యుడికి ఎక్కువగా ఉపయోగపడే ఇన్నోవేషన్స్ కొన్నే ఉంటయి. వాటిల్లో ఇదొకటి. సైకిల్ ని ఎలక్ట్రిక్ బైక్ గా మార్చి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయడం ఎలాగో చెబుతున్నడు ఏసీ సర్వీస్ ఇంజినీర్ వెంకటరమణ.

భద్రాచలం, వెలుగు: ‘భద్రాచలం టౌన్లో 15 ఏళ్ల నుంచి ఏసీలు, ఫ్రిజ్లు రిపేర్ చేస్తున్న. ఈ మధ్య బ్యాటరీ సైకిల్స్ షాప్ ఒకటి పెట్టారు. ఆ సైకిల్ చూద్దామని అందరి లెక్కనే నేను కూడా పోయిన. సైకిల్ బాగనే ఉంది. కానీ, రేటు మాత్రం సామాన్యులు కొనేటట్టు లేదు. ఆ బ్యాటరీ సైకిల్ మోడల్స్ రేట్లు 40 నుంచి 57 వేల రూపాయల వరకు ఉన్నాయి. ఇప్పుడు సైకిల్ తొక్కేవాళ్లలో పేదవాళ్లే ఎక్కువ. వాళ్లు అంత డబ్బు పెట్టలేరు. కానీ ఇది చాలా బాగుంది. సైకిల్ మీద లాంగ్ జర్నీ చాలా కష్టంగా ఉంటది. ఓపికున్నంత సేపు తొక్కి, అలసిపోంగనే బ్యాటరీతో డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి, ఇంకెక్కడికైనా చేరుకోవచ్చు. కాన్సెప్ట్ బాగనే ఉంది. కానీ రేటు ఎక్కువ. ఎట్లయినా దీన్ని ఇంతకంటే తక్కువ ధరకే తయారు చేయాలనుకున్న. ఆ బ్యాటరీ సైకిల్లో ఏఏ పార్ట్స్ ఉన్నయి. ఎట్ల ఫిక్స్ చేశారో అబ్జర్వ్ చేసిన. బ్యాటరీ, పవర్ కంట్రోలర్, హారన్, ఎక్సలేటర్, హెడ్లైట్ని ఆర్డర్ చేసి, ముంబయి నుంచి తెప్పించిన.

చూసినోళ్లంతా ముచ్చటపడ్డారు

ఏసీలు రిపేర్ చేసిన అనుభవం వల్ల ఎలక్ర్టిక్ బ్యాటరీ, ఎక్స్లేటర్ మీద కొంత నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఎలక్ర్టిక్ బైక్ తయారీకి ఇబ్బంది ఉండదనుకున్న. మార్కెట్లో ఉన్న సైకిల్నే ఎలక్ర్టిక్ సైకిల్గా మార్చాలనుకున్న. 7,500 రూపాయలతో ఒక సైకిల్కొన్న. దానికి ముంబయి నుంచి తెప్పించిన 24 ఓల్ట్స్, 24 ఆంఫియర్స్ బ్యాటరీ ఫిక్స్ చేసిన. పవర్ కంట్రోలర్, యాక్సలరేటర్, హారన్, హెడ్లైట్స్ని కనెక్ట్ చేసిన. ఈ పనిముట్లన్నీ 13,500 రూపాయలకే కొన్న. సేప్టీగా ఉండేటట్టుగా ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ ఒక్కోదాన్ని ఫిక్స్ చేసిన. బ్యాటరీ సైకిల్ బాగనే పోతుంది. ఓకే అనుకున్న. ఇది చూసి జనమంతా ఆశ్చర్యపోతున్నారు. 21 వేల రూపాయలకే ఎలక్ర్టిక్ బ్యాటరీ సైకిల్ తయారైంది.

గ్యాస్ సైకిల్ తెస్తా!

ఈ బ్యాటరీని ఫుల్ చార్జ్ చేయడానికి 3 గంటలు పడుతుంది. ఫుల్ చార్జ్ అయిన బ్యాటరీతో 30 కి.మి. దూరం నడుస్తుంది. పోవాల్సిన చోటు అంతకంటే ఎక్కువ దూరం ఉంటే ఆ తర్వాత సైకిల్ తొక్కుకుంటూ పోవచ్చు. బ్యాటరీ అయిపోయిందని చార్జింగ్ కోసం ఆగిపోయే ఇబ్బంది ఇందులో ఉండదు. స్కూల్ పిల్లలకు ఉపయోగపడేలా ఉండాలనే ఈ ప్రయోగం చేశాను. పేరెంట్స్ కొనగలిగే రేటులో ఉంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ కొంటారని దీన్ని తయారు చేశాను. తొందర్లోనే గ్యాస్తో నడిచే హైబ్రిడ్ సైకిల్ని తయారు చేస్తాను. అరకిలో గ్యాస్ నిల్వ ఉండే చిన్న గ్యాస్ బండని సైకిల్కి ఫిట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న’ అంటున్నడు. అది కూడా ఇట్లనే తక్కువ రేటుకే వస్తే స్కూల్ పిల్లలకు భలేగా ఉంటుంది!