టీవీ యాక్టర్ జగేశ్ ముకాటి (47) మృతి

న్యూఢిల్లీ: శ్రీ గణేశ్, అమితా కా అమిత్ లాంటి పాపులర్ హిందీ సీరియల్స్‌లో తనదైన నటనతో ఆకట్టుకున్న టీవీ యాక్టర్ జగేశ్ ముకాటి (47) చనిపోయాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బుందిగా ఉండటంతో రీసెంట్‌గా ముంబైలోని ఓ ఆస్పత్రిలో జగేశ్‌ను చేర్చారు. జగేశ్ మృతిపై ఆర్టిస్ట్స్ ఆర్గనైజేషన్ సీఐఎన్‌టీఏఏ సంతాపం వ్యక్తం చేసింది. జగేశ్ చనిపోవడానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రిపోర్ట్స్‌ ప్రకారం.. ఆస్పత్రిలో అడ్మిట్ అయినప్పుడు జగేశ్‌కు కరోనా టెస్టులు నిర్వహించారు. వాటిలో ఆయనకు నెగిటెవ్‌గా వచ్చిందని సమాచారం.

Latest Updates