టీవీలను కొనట్లే! జీఎస్టీ తగ్గించాలంటున్నకంపెనీలు

న్యూఢిల్లీ : ఐసీసీ వరల్డ్ కప్‌‌తో జోరుగా డిమాండ్ వచ్చిన టీవీలకు, ఒక్కసారిగా ఇప్పుడు డిమాండ్ పడిపోయింది. టీవీల వైపు చూసే వారే కరువయ్యారు. టీవీ ప్యానల్ అమ్మకాలు తగ్గిపోయాయని, అమ్మకాలను పెంచడానికి జీఎస్టీని తగ్గించాలంటూ తయారీదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఓపెన్ సెల్ టెలివిజన్ ప్యానల్స్‌‌పై ఉన్న దిగుమతి సుంకం నుంచి కూడా విముక్తి కల్పించాలని అడుగుతున్నారు. కన్జూమర్‌‌ సెంటిమెంట్లు తగ్గడంతో, డిమాండ్ పడిపోయిందని మానుఫాక్చరర్స్‌‌ తెలిపారు. వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్స్ వంటి ఇతర హోమ్ అప్లియెన్సస్ సేల్స్ కూడా జూలై నెలలో తగ్గినట్టు పేర్కొన్నారు. డిమాండ్‌‌ లేకపోవడంతో, మొత్తంగా ఇండస్ట్రీ గ్రోత్ ఫ్లాట్‌‌గా ఉందని కన్జూమర్‌‌ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లియెన్సస్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్(సీఈఏఎంఏ) ప్రెసిడెంట్ కమల్ నంది పేర్కొన్నారు. ఇండస్ట్రీ నెగిటివ్‌‌లోకి పడిపోకముందే, దానికి కాస్త సాయం అందివ్వాలని కోరారు. అప్లియెన్సస్‌‌పై జీఎస్టీ తగ్గించాలని అభ్యర్థించారు. చాలా క్వార్టర్ల తర్వాత టీవీలు మళ్లీ వృద్ధిలోకి పయనించడం చూశామని, కానీ మళ్లీ డిమాండ్ పడిపోయిందన్నారు.

Latest Updates