పోలీసుల అదుపులోకి టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్

హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి ప్రకాశ్ తో పాటు టీవీ9 మాజీ ఉద్యోగి మూర్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు నిధుల దుర్వినియోగంపై రవి ప్రకాశ్ పై కేసులు నమోదయ్యాయి.

కంపెనీకి తెలియకుండా రవిప్రకాశ్ టీమ్రూ.6.36 కోట్లు విత్ డ్రా చేశారని అలంద మీడియా ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు శనివారం రవిప్రకాశ్ ను అదుపులోకి తీసుకున్నారు.

Latest Updates