టీవీ9 మాజీ CEO రవి ప్రకాష్ రిమాండ్ కు తరలింపు

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై 409,418, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెస్ట్ జోన్ ఇంఛార్జ్ డీసీపీ సుమతి తెలిపారు.  ఇప్పటికే ఫోర్జరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాష్ ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవిప్రకాష్ , కేబీఎన్ మూర్తిలు ఫలు దఫాలుగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్లు  ప్రస్తుత టీవీ9 సీఓఓ గొట్టిపాటి సింగారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవిప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారు.

వైద్యపరీక్షల నిమిత్తం రవిప్రకాశ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మారేడుపల్లి జడ్జ్ నివాసంలో హాజరుపరిచి.. రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ సుమతి మీడియాతో మాట్లాడుతూ రవి ప్రకాశ్, మూర్తి కలిసి సుమారు రూ.18 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారన్నారు. సొంతలాభం కోసం బోనస్, ఎక్స్‌గ్రేషియా పేరుతో కంపెనీ అకౌంట్ నుంచి డ్రా చేసుకున్నట్లు సూచించారు. ఇందులో ఎలాంటి నియమ నిబంధనలను పాటించకుండా.. బోర్డు, షేర్ హోల్డర్స్ ఆమోదం లేకుండానే డబ్బును విత్ డ్రా చేసి కంపెనీకి నష్టం చేకూర్చారన్నారు.

Latest Updates