నాపై పుకార్లు నమ్మొద్దు : TV9 రవిప్రకాశ్

హైదరాబాద్ : ఫోర్జరీ వివాదంలో తనను అరెస్ట్ చేస్తారన్న ప్రచారాన్ని నమ్మొద్దని టీవీ9 రవిప్రకాశ్ చెప్పారు. షేర్ల వ్యవహారంలో ఈనెల 16న కంపనీ లా ట్రైబ్యునల్ లో కేసు విచారణ ఉందన్నారు. ఈ కేసు ఆధారంగా తనపై తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. తనను ఎవరూ అరెస్ట్ చేయలేదని.. చేయబోవడం లేదని ఆయన అన్నారు. గురువారం సాయంత్రం ఆయన టీవీ9 ఛానెల్ ఆఫీసుకు వచ్చి మాట్లాడారు. టీవీ9 సీఈఓ హోదాలోనే తాను ఈ ప్రకటన చేస్తున్నట్టు చెప్పారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లానన్న వార్తల్లో నిజం లేదని చెప్పారు రవిప్రకాశ్.

Latest Updates