శిల్పకు సాయమందించిన వాళ్లలో అప్పుడు మహేష్.. ఇప్పుడు కేటీఆర్..

అప్పుడు హీరో మహేష్ బాబు.. ఇప్పుడు మంత్రి కేటీఆర్..

గతంలో శిల్పారెడ్డికి సాయం చేసిన మహేష్ బాబు

ఎవరికైనా ఏదైనా ఆపదొచ్చినా, ఆరోగ్యం సరిగా లేకపోయిన కేటీఆర్‌కు ఒక్క ట్వీట్ పెడితే చాలు ఆయన ఎంతలా స్పందిస్తారో నెటిజన్లకు తెలియంది కాదు. తెలంగాణలో చాలామంది తమకు కానీ, తమకు తెలిసిన వారికి కానీ ఆరోగ్యం బాగాలేకపోతే కేటీఆర్‌కు ట్వీట్ చేసి ఇలా సాయం పొందారు. ఇప్పుడు అది పక్క రాష్ట్రాలకు కూడా పాకింది. కర్ణాటకకు చెందిన శిల్పా రెడ్డి అనే అమ్మాయికి స్పైనల్ కార్డ్ సమస్య ఉంది. ఆమెకు ఆపరేషన్ చేస్తే తప్ప నడవలేని పరిస్థితి. అందుకు ఆ అమ్మాయి హీరో మహేష్ బాబును వేడుకుంది. దానికి స్పందించిన ఆయన శిల్ప ఆపరేషన్ కోసం 10 లక్షల ఆర్థిక సాయం చేశారు. దాంతో శిల్ప స్పైనల్ కార్డ్ ఆపరేషన్ చేయించుకుంది.

ఇప్పుడు ఆమె నడవాలంటే కాళ్లకు బెల్ట్ వేయించుకోవాలి. అందుకోసం తనకు 90 వేల ఆర్థిక సాయం చేయవలసిందిగా ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌ను కోరింది. దానికి స్పందించిన కేటీఆర్ శిల్ప కర్ణాటకకు చెందిన అమ్మాయి కాబట్టి, మేము ఆమెకు ప్రభుత్వం నుండి సహాయం చేయలేము అని ట్విట్టర్ ద్వారా సమాధానమిచ్చారు. కానీ, ఎవరైనా ధాతలు ముందుకు వచ్చి శిల్పకు సహాయం చేయవలసిందిగా ఆయన కోరాడు. దాంతో ఓ అపరిచిత వ్యక్తి శిల్పకు సాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఆ వ్యక్తి కేటీఆర్‌ను కలిసి శిల్పకు అందించవలసిందిగా కోరుతూ చెక్కును అందించాడు.

Latest Updates