ఇరాక్‌‌లో భారీ ఆత్మాహుతి దాడి

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌‌లో ట్విన్ సూసైడ్ బాంబ్ అటాక్ జరిగింది. ఈ పేలుడులో 13 మంది వరకు చనిపోయారని, 30 మందికి పైగా గాయపడ్డారని సెక్యూరిటీ వర్గాల సమాచారం. ఈ దాడులకు ఎవరు పాల్పడ్డారనేది ఇంకా తెలియరాలేదు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సెంట్రల్ బాగ్దాద్‌‌లో టయారన్ స్క్వేర్‌‌లో ఎక్కువ మంది జన సమూహం ఉన్న చోట పేలుడు పదార్థాలతో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని ఇరాకీ మిలటరీ వర్గాలు తెలిపాయి. 2017లో ఇస్లామిక్ స్టేట్ పతనం తర్వాత బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడులు జరగడం బాగా తగ్గాయి. ఇరాక్‌‌లో చివరగా 2018 జనవరిలో ఇలాంటి అటాక్ జరిగింది.

Latest Updates