వావ్..! అమ్మ కడుపులో కవలల కొట్లాట

వింటుంటేనే ఎంత క్యూట్ అనిపిస్తోందో కదా. ఎక్కడైనా చిన్న పిల్లలు ఇద్దరు కూర్చుంటేనే ముద్దొస్తారు. వారిద్దరు చిన్నగా గొడవపడుతుంటే అరెరే అనిపిస్తుంది. అలాంటిది.. వారిద్దరు ట్విన్స్ అనుకోండి… వారెవా అనేస్తాం.. వద్దంటూ ముద్దుచేస్తాం. అలాంటిది.. ఓ ఇద్దరు ట్విన్స్ అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఫైటింగ్ కు దిగారనుకోండి… ఆ అమ్మానాన్నలకే కాదు.. అది చూసిన ఎవరికైనా ఆనందం కలగకమానదు.

చైనాలోని యించువాన్ నగరంలో ఇలాంటిదే ఓ అరుదైన సంఘటన జరిగింది. కొన్నాళ్ల కిందట.. ఇద్దరు భార్యాభర్తలు రెగ్యులర్ ప్రెగ్నెన్సీ అల్ట్రా సౌండ్ స్కానింగ్ కోసం హాస్పిటల్ కు వెళ్లారు. అక్కడ స్కానింగ్ కవలలు ఉన్నారని తెలిసి సంబరపడ్డారు. అలాగే.. ఓ సందర్భంలో… వారి ఎదుగుదలను , కదలికలను గమనిస్తున్నప్పుడు.. వారిద్దరూ ఒకరిపైకి మరొకరు రావడంతో… ఒకరినొకరు చేతులతో కొట్టుకోవడం.. ఒకరినొకరు హగ్గింగ్ చేసుకోవడం కనిపించింది. ఇది చూసిన భర్త తావో.. దానిని వీడియో తీశాడు. కడుపులో ట్విన్స్ చేసిన అల్లరికి ఆ తల్లిదండ్రులు ముచ్చటపడ్డారు. ఆ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి ప్రపంచమంతా తిరుగుతోంది. అమ్మ కడుపులో ఉన్నప్పుడే కవలలు చేసిన అల్లరిని చూసి.. ఇపుడు ప్రపంచమంతా ముచ్చటపడిపోతోంది.

ఆ తల్లిదండ్రులు కొద్దిరోజుల కిందట ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. వారిద్దరికీ గమ్మత్తైన పేరు పెట్టుకున్నారు. ఒకరి పేరు చెర్రీ .. మరొకరి పేరు స్ట్రాబెరీ. సూపరున్నాయిగా ఆ కొంటె పిల్లల పేర్లు. వాళ్లు ఈ భూమిమీదకు రాకముందే జనాలకు బాగా తెలిసిపోతారని తాను ఊహించలేదని ఆ తల్లిదండ్రులు ఆనందంతో చైనీస్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పారు. మీరూ ఓసారి ఆ వీడియో చూసేయండి.

 

 

Latest Updates