88 వేల ట్విట్టర్ అకౌంట్లు బ్లాక్

వివిధ దేశాల ప్రభుత్వాలకు మద్దతుగా మోసపూరితమైన ఆపరేషన్లకు పాల్పడుతున్న అకౌంట్లను ట్వి ట్టర్, ఫేస్ బుక్ బ్లాక్ చేశాయి. సౌదీ ఆరేబియాకు లింక్ గా ఉన్న 88,000అకౌంట్లను బ్లాక్ చేశామని ట్వి ట్టర్ శుక్రవారం తెలిపింది. వీటిలో 5,929 అకౌంట్ల వివరాలను బయటపెట్టింది. మరోవైపు వియత్నాం కేంద్రంగా నిర్వహిస్తున్న ​నెట్ వర్క్ ను బ్లాక్ చేశామని ఫేస్ బుక్ పేర్కొంది. ఇది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా పోస్టులు చేస్తోందని తెలిపింది. ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్ లో కలిపి 600కు పైగా అకౌంట్లను సంస్థ బ్లాక్ చేసింది.

Latest Updates