ట్విట్ట‌ర్ హ్యాక్ : 367 ట్వీట్టర్ యూజ‌ర్ల నుంచి ‌90 ల‌క్షలు కాజేసిన హ్యాక‌ర్స్

ట్వీట్ట‌ర్ అకౌంట్స్ ను హ్యాండిల్స్ చేస్తున్న సుమారు 367మంది నెటిజ‌న్ల‌కు చెందిన బ్యాంక్ అకౌంట్ ల‌లో పెద్ద మొత్తంలో డ‌బ్బు మాయ‌మైంది.

సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కాస్‌పెర్స్కీ ప్రకారం.. బిట్ కాయ‌న్స్ హ్యాకర్స్ కేవలం రెండు గంటల్లో ట్విట్ట‌ర్ హోల్డ‌ర్ల అకౌంట్ల‌నుంచి రూ. 90ల‌క్ష‌లు పైగా సొమ్మును కాజేసిన‌ట్లు వార్త‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. దీనిపై ట్విట్ట‌ర్ సీఈఓ జాక్ డోర్సే క్షమాపణలు చెప్పారు. ట్విట్ట‌ర్ అకౌంట్స్ హ్యాక్ అవ్వ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మేన‌ని అన్నారు.
సామాన్యుల నుంచి యుఎస్ డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్, బరాక్ ఒబామా, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, జెఫ్ బెజోస్, ఆపిల్ , ఉబెర్లతో సహా ప‌లువురు కార్పొరేట్ దిగ్గ‌జాల‌కు చెందిన ట్విట్ట‌ర్ అకౌంట్ల ద్వారా హ్యాక్ చేసేందుకు హ్యాక‌ర్లు క్రిప్టో క‌రెన్సీ పేరుతో మాల్ వేర్ ను క్రియేట్ చేసి..ఆ మాల్ వేర్ సాయంతో ప్ర‌ముఖుల అకౌంట్ల‌ను హ్యాంక్ చేసే ప్ర‌య‌త్నాలు చేశార‌ని, అవి సాధ్యం కాలేద‌ని ట్విట్ట‌ర్ సీఈఓ జాక్ తెలిపారు.

ఇటువంటి మోసాలు గతంలో జరిగాయ‌ని, కానీ ఈ స్థాయిలో ఎప్పుడూ జరగలేదని జియోటస్ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ సహ వ్యవస్థాపకుడు మరియు సిఒఒ అర్జున్ విజయ్ అన్నారు.

బ్యాంక్ అకౌంట్ల ‌నుంచి న‌గ‌దు దొంగిలించేందుకు క్రిప్టో క‌రెన్సీ హ్యాక‌ర్స్ ప్ర‌యత్నిస్తున్నార‌ని, సోష‌ల్ మీడియా పోస్ట్ లను షేర్ చేస్తూ వాటి ద్వారా బ్యాంక్ అకౌంట్ల నుంచి డ‌బ్బును మాయం చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ని, ప్ర‌తీ ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని జియోటస్ సీఒఒ విజ‌య్ హెచ్చ‌రించారు.

Latest Updates