ట్విట్టర్ చేతికి టిక్‌టాక్‌?

డీల్‌‌‌‌పై చర్చలు షురూ

వాషింగ్టన్: ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యూఎస్‌‌లో బ్యాన్ చేసిన వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌‌ను ట్విట్టర్ కొనుగోలు చేయాలని చూస్తోంది. మైక్రోసాఫ్ట్‌‌తో పాటు ట్విట్టర్ కూడా టిక్‌టాక్ కొనుగోలుకు ప్రయత్నిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ట్విట్టర్‌‌లో టిక్‌టాక్‌‌ను విలీనం చేసుకునేందుకు చర్చలు జరుగుతున్నట్టు పేర్కొన్నాయి. అయితే టిక్‌టాక్ యూఎస్ ఆపరేషన్స్‌ ను కూడా కలుపుకుని ట్విట్టర్ ఈ డీల్‌‌ను కొనసాగిస్తుందా..? లేదా..? అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. అమెరికాలో యూఎస్ ఆపరేషన్స్‌‌ను కూడా ఈ డీల్‌‌లో ట్విట్టర్ కలుపుకుంటే.. మైక్రోసాఫ్ట్ లేదా ఇతర బిడ్డర్ల మాదిరి యాంటీ ట్రస్ట్ స్క్రూటినీని ఆ కంపెనీ ఎదుర్కోలేదని వాదనలు వినిపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ కూడా గత కొన్ని వారాల నుంచి టిక్‌టాక్ ఓనర్ బైట్‌‌డ్యాన్స్‌‌తో చర్చలు జరుపుతోంది. మైక్రోసాఫ్ట్ ఈ డీల్‌‌లో ఫ్రంట్‌ ‌రన్నర్‌‌గా ఉంది. టిక్‌టాక్ కొనుగోలుపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌‌తో కూడా చర్చించారు. ‌టిక్‌టాక్‌‌ను ట్విట్టర్‌ కొనుగోలు చేస్తుందని వస్తోన్న మార్కెట్ రూమర్లపై తాము కామెంట్ చేయమని టిక్‌టాక్ అధికార ప్రతినిధి అన్నారు. ట్విట్టర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 29 బిలియన్ డాలర్లుగా ఉంది. మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్ 1.6 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువే. ఒకవేళ టిక్‌టాక్‌‌ను ట్విట్టర్ కొనాలనుకుంటే, ఇతర ఇన్వెస్టర్ల సాయం కూడా తీసుకోవాల్సి ఉంటుందని డౌ జోన్స్ చెప్పింది.

For More News..

ఆన్‌‌లైన్ కంపెనీల్లో జాబ్స్ జోరు

టిక్‌టాక్ ప్లేస్ లో వచ్చిన చింగారికి రూ.9 కోట్ల మనీ

Latest Updates