8ఏళ్ల క్రితమే “కోబీ బ్రయాంట్” మరణాన్ని ఊహించిన నెటిజన్..!

అమెరికా బాస్కెట్ బాల్ దిగ్గజం కోబీ బ్రయాంట్ (41) మృతి పట్ల ప్రపంచ దేశాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. అయితే కొన్ని సంవత్సరాల క్రితమే కోబీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తారని సోషల్ మీడియాలో ముందే ఊహించినట్లు తెలుస్తోంది.

తన అద్భుతమైన విన్యాసాలతో ప్రత్యర్ధుల్ని ఏమార్చి స్కోర్ చేయడం కోబీ దిట్ట . అందుకే ప్రత్యర్ధులు సైతం ప్రత్యర్ధులు కోబీని ఆఫ్రికా ప్రమాదకర సర్పం ‘బ్లాక్ మాంబా’తో పోల్చుతారు.

అంతటి పేరు ప్రఖ్యాతల్ని గడించిన కోబీ ఆదివారం సబర్బన్ లాస్ ఏంజిల్స్‌లో పొగమంచు కారణంగా హెలికాప్టర్ కుప్పకూలి మంటలు చెలరేగడంతో మరణించారు.  ఈ ప్రమాదంలో కొబ్ బ్రయాంట్‌తో పాటు ఆయన 13 ఏళ్ల కూతురు జియానాతో పాటు మొత్తం తొమ్మిది మంది మరణించారు. కొబ్ బ్రయంట్‌, ఆయన కూతురు జియానాను అధికారులు గుర్తించగా.. పైలట్, మరో ఆరుగురి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసిన ఈ ఘటనను ఓ నెటిజన్ ముందే ఊహించినట్లు సమాచారం.

డాట్ నోసో అనే పేరుగల ట్వీట్టర్ అకౌంట్ నుంచి సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట అంటే నవంబర్ 14, 2012లో  ఓ ట్వీట్  వెలువడింది. హెలికాప్టర్ కూలిపోవడం వల్ల కోబ్ బ్రయాంట్ మరణిస్తారని అప్పట్లో ఆ ట్వీట్‌ చేయడం సంచలనంగా మారింది. ట్వీట్ పై ఆయన అభిమానులు, నెటిజన్లు దుమ్మెత్తిపోశారు.

తాజాగా  డాట్ నోసో అకౌంట్ నుంచి ట్వీట్ వైరల్ గా మారింది. ఆపోస్ట్ ను రీట్వీట్ చేస్తూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.