ప్రియాంక గాంధీకి ట్విట్టర్ లో బెదిరింపులు

కాల్చేస్తానని ఓ యూజర్ మెసేజ్
కేసు నమోదు చేసిన పోలీసులు
లక్నో: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాను కాల్చేస్తానని బెదిరించినందుకు ఓ ట్విట్టర్ యూజర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బస్తీకి చెందిన కాంగ్రెస్ కార్యకర్త పంకజ్ ద్వివేదీ కంప్లెయింట్ ఆధారంగా సెక్షన్ 506, 66 కింద కేసులు ఫైల్ చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ప్రియాంక రాసిన లేఖపై ఓ న్యూస్ రిపోర్ట్ ను ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశాడని కంప్లెయింట్ లో పంకజ్ చెప్పారు. ప్రియాంకును బెదిరిస్తూ మెసేజ్ చేశాడని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసి రెండ్రోజులు అవుతున్నా పోలీసులు ఎవర్నీ అరెస్టు చేయలేదని యూపీ కాంగ్రెస్ కన్వీనర్ లలన్ కుమార్ మండిపడ్డారు.

Latest Updates