బెంగళూరులో ప్రమాదం : రెండు సూర్యకిరణ్ విమానాలు క్రాష్

కర్ణాటక : బెంగళూరులో ఎయిరో ఇండియా షో 2019కు ముందు మరో విమాన ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం రీహార్సల్ చేస్తుండగా… సూర్యకిరణ్ ఏరోబాటిక్స్ టీమ్ కు చెందిన 2 ఎయిర్ క్రాఫ్ట్ లు క్రాష్ అయ్యాయి. బెంగళూరు ఎలహంక ఎయిర్ బేస్ లో ఈ ప్రమాదం జరిగింది. విమానాల్లోని పైలట్లు ముందే పారాచూట్ల సహాయంతో దిగిపోయారని.. వారికి ప్రమాదం లేదని బెంగళూరు పోలీసులు చెప్పారు. ఎలహంక న్యూటౌన్ లోని ఇస్రో లేఔట్ లో విమానాల శిథిలాలు పడ్డాయని చెప్పారు. ఓ పౌరుడు గాయపడ్డాడని వివరించారు.

ఇటీవలే ఓ ఎయిర్ క్రాఫ్ట్… ఆకాశంలో విన్యాసాలు చేస్తుండగా బెంగళూరు శివారులో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ చనిపోయాడు. బెంగళూరులో ఎయిరో ఇండియా షో 2019 ఫిబ్రవరి 20 నుంచి 24 వరకు జరగనుంది. ఈ షో కంటే ముందు 2 ప్రమాదాలు జరిగాయి.

Latest Updates