ధరణి పేరుతో నకిలీ మొబైల్ యాప్.. ఇద్ద‌రు అరెస్ట్

హైదరాబాద్‌: భూ సమగ్ర సర్వేల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘ధరణి’ యాప్ పేరుతో నకిలీ మొబైల్ యాప్‌ను సృష్టించారు కొంద‌రు కేటుగాళ్లు. ధరణి పేరుతో నకిలీ మొబైల్ యాప్ క్రియేట్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఐపీ అడ్రస్ ఆధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని బసవ కళ్యాణ్ గ్రామానికి చెందిన మహేష్, ప్రేమ్ మూలె అనే ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.

Latest Updates