గ్రేట్ బ్ర‌ద‌ర్స్: దానం చేయ‌డానికి ఆస్థులు అమ్మారు

ఆస్తి కోసం కొట్లాడే అన్న‌ద‌మ్ముళ్లున్న‌ ఈ రోజుల్లో .. ఓ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముళ్లు మాత్రం లాక్ డౌన్ లో ఇబ్బందులు ప‌డుతున్న పేద‌ల కోసం త‌మ ఆస్తుల‌నే అమ్మి సాయం చేశారు. ఈ సంఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో జ‌రుగ‌గా వారిపై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం దేశంలో లాక్ డౌన్ విధించ‌గా..చాలామంది రోజూవారీ కూలీలు ప‌నుల్లేక ప‌స్తులుంటున్నారు. ఇలాంటి వారి ఆక‌లి తీర్చేంద‌కు కొంద‌రు మ‌న‌సున్న మారాజులు అందిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే క‌ర్ణాట‌క కొలార్ కు చెందిన ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముళ్లు పేద‌ల‌కు ఆహారం ఇచ్చేందుకు త‌మ స్థ‌లం అమ్ముకున్నారు. పొలం అమ్మ‌గా వ‌చ్చిన డ‌బ్బుతో నిత్యావ‌స‌ర స‌రుకులు కొని దాదాపు 12 వేల మందికి పంచారు. అంతేకాదు ప్ర‌తిరోజూ అన్న‌దానం చేస్తూ పేద‌ల ఆక‌లి తీరుస్తున్నారు ఈ ఇద్ద‌రుమిత్రులు. అంద‌రి చేత గ్రేట్ బ్ర‌ద‌ర్స్ అనిపించుకుంటున్నారు.

Latest Updates