రోడ్డు ప్రమాదంలో ఇద్ద‌రు అన్నద‌మ్ములు మృతి

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్ద‌రు అన్నద‌మ్ములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అన్న‌ద‌మ్ములైన అంబటి అరుణ్ గౌడ్ (22), అంబటి అరవింద్ గౌడ్ (19)లు బండి సర్విసింగ్ కోసం.. బైక్ పై వెళ్తుండగా ముప్కాల్ బైపాస్ రోడ్ కొత్తపల్లి శివారు లో బండి అదుపు తప్పి క్రింద ప‌డిపోయారు. ఈ ప్ర‌మాదంలో ఒకరు అక్కడికి అక్కడే మృతి చెందగా.. మ‌రొక‌రు ఆసుపత్రికి చేరాక మృతి చెందారు. పోలీసులు ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates