రాఖీ క‌ట్టి.. అక్క‌ని దారుణంగా హ‌త్య చేసిన అన్న‌ద‌మ్ములు

రాఖీ పౌర్ణ‌మి రోజు దారుణం జ‌రిగింది. చెల్లికి రాఖీ క‌ట్టిన అన్న‌లు ఆమెను దారుణంగా హ‌త్య చేశారు. అహ్మ‌దాబాద్ లోని స‌రిత రెసిడెన్సీలో జ‌రిగిన దారుణం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. అహ్మాదాబాద్ కు చెందిన సాజిజుల్ షేక్, రోజోలి షేక్ ల సోద‌రి సౌకీ గా పోలీసులు గుర్తించారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్ర‌కారం..

రాఖీ ని కట్టే నెపంతో సాజిజుల్, రోజోలిలు తమ అక్క‌ను చూసేందుకు వ‌చ్చారు. అన్న‌ద‌మ్ములు ఇంటికి రావ‌డంతో అక్క సౌకీ టీ పెట్టింది. టీ తాగిన అనంత‌రం ఇద్ద‌రు ఆమెకు రాఖీ క‌ట్టారు. రాఖీ క‌ట్టి దారుణంగా హ‌త్య చేశారు. అనంతం ఆమె బీరువాలో ఉన్న 6 ల‌క్ష‌ల న‌గ‌దును అప‌హ‌రించారు.

సౌకీ హ‌త్య‌పై స్థానికులు స‌మాచారంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ర‌క్తం మ‌డుగులో ఉన్న బాధితురాల్ని పోలీసులు గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని ఆస్ప‌త్రికి త‌ర‌లించి..నిందితుల కోసం గాలింపుల చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ గాలింపు చ‌ర్య‌ల్లో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచార‌ణ చేప‌ట్టారు.

ఈ విచార‌ణ‌లో నిందితులు త‌మ సోద‌రిని హ‌త్య చేసిన‌ట్లు ఒప్పుకున్నారు. సాజిజుల్, రోజోలిల‌కు భార్య‌లు విడాకులిచ్చారు. ఆ విడాకుల‌కు కార‌ణం తమ అక్కేన‌ని, అందుకే హ‌త్య చేసిన‌ట్లు సాజిజుల్, రోజోలిలు ఒప్పుకున్నారు.

Latest Updates