మల్లన్నసాగర్ కేసులో కలెక్టర్లకి ఫైన్

మల్లన్న సాగర్  నిర్వాసిత రైతులు, కూలీల కేసులో జిల్లా అధికారులకు జరిమానా విధించింది హైకోర్టు. రైతులు వేసిన కేసులో  ప్రస్తుత కలెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి, సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్ తో  పాటు.. గత ఆర్డీవో జయచందర్ రెడ్డికి శిక్షలు విధిస్తూ తీర్పు వెలువరిచింది. సిద్దిపేటలో గతంలో పనిచేసిన ఆర్డీవో జయచందర్ రెడ్డికి రెండు నెలల జైలు శిక్షతో పాటు.. 2 వేల రూపాయల ఫైన్ విధించింది.

మరోవైపు ప్రస్తుత సిద్దిపేట… సిరిసిల్ల కలెక్టర్ లకు ఒక్కొక్కరికి  2 వేల రూపాయల ఫైన్ వేసింది. ఒకవేళ నాలుగు వారాల్లో ఫైన్ చెల్లించకపోతే… ఒక నెల జైలు శిక్ష విధించింది. అంతే కాదు అధికారుల సర్వీస్ రికార్డులతో …. కోర్టు దిక్కరణ విషయాలను  పొందుపర్చాలని ఆదేశించింది హైకోర్టు.

సూపర్ ఓవర్ లో కివీస్ పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ

see also : లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠ

రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది

Latest Updates