వసంత పంచమి: కుంభమేళాలో 2 కోట్ల మంది పుణ్య స్నానాలు!

వసంత పంచమి సందర్భంగా ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఇవాళ 2 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసారని అంచనా. దేశం నలు మూలల నుంచి ప్రయాగ్ రాజ్ కు శనివారమే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. కుంభమేళాలో మూడోది, చివరిదైన షాహీ స్నాన్ ను వసంతపంచమి రోజున చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. భక్తుల రద్దీ పెరగడంతో యూపీ పోలీసులు, కేంద్ర రిజర్వ్ బలగాలు కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో మోహరించారు.

అర్ధ కుంభమేళాలో జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా మొదటి పుణ్యస్నానం, ఫిబ్రవరి 4న మౌనీ అమావాస్య సందర్భంగా రెండో పుణ్యస్నానం, ఇవాళ వసంత పంచమి సందర్భంగా చివరి పుణ్యస్నానం జరగనుంది. ఇవాళ నదిలో మూడు మునకలు వేయడం ద్వారా.. గంగ, యమున, అంతర్వాహిని సరస్వతి నదుల్లో పుణ్యస్నానం చేసిన ఫలితం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

Latest Updates