హైదరాబాద్‌లో రెండ్రోజులపాటు 144 సెక్షన్

బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన రోజు (1992 డిసెంబరు 6) దగ్గరపడడంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సిటీలో కొన్ని గ్రూపులు హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం అందడంతో పాత నేరస్తులపై నిఘా పెంచారు. అలాగే సిటీ అంతా భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. మరోవైపు ముందు జాగ్రత్తగా రెండ్రోజుల పాటు 144 సెక్షన్ విధించాలని సిటీ పోలీసులు నిర్ణయించారు.

హైదరాబాద్‌లో డిసెంబరు 5వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. కొన్ని గ్రూపులు హింసాత్మక ఘటనలకు పాల్పడాలని ప్లాన్ చేస్తున్నాయని తమకు పక్కా సమాచారం ఉందన్నారు. డిసెంబరు 6న మత విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించే చాన్స్ ఉన్నందున అటువంటి ఘటనలే జరగకుండా మత సామరస్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీపీ చెప్పారు. లా అండ్ ఆర్డర్ కాపాడడం కోసం రెండ్రోజుల పాటు హైదరాబాద్ సిటీ పరిధిలో 144 సెక్షన్ విధిస్తున్నామని అంజనీకుమార్ తెలిపారు.

Latest Updates