ఆగివున్న లారీని ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు డిగ్రీ విద్యార్థులు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.  వేములవాడ -సిరిసిల్ల రహదారిలో అర్థరాత్రి నంది కమాను వద్ద ఆగివున్న లారీని ఓ ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో  అక్కడికక్కడే ఇద్దరు డిగ్రీ విద్యార్థుల మృతి చెందారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతులను తంగలపల్లి మండలం అంకుసపూర్ గ్రామానికి చెందిన పెంటల వెంకటేష్ (19) క్యారం అజయ్ కుమార్ (19) గా గుర్తించారు. బోయినిపల్లి మం డలం వరద వెళ్లిలో స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ  ప్రమాదం జరిగిందని చెప్పారు. మృత దేహాలను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

Latest Updates