ORRపై రోడ్డు ప్రమాదం:ఇద్దరు మృతి

హైదరాబాద్ పెద్ద అంబర్‌పేట్‌  ORRపై  ఇవాళ( సోమవారం) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని డీసీఎం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలం దగ్గకు చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

Latest Updates