అన్నాదమ్ముళ్ల మధ్య పంచాయితీ పెట్టిన పెంపుడు కుక్క‌

ఓ పెంపుడు కుక్క ఇద్ద‌రు అన్నాద‌మ్ముల కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. పరస్పరం ఒకరిపై దాడులు చేసుకునేలా వివాదం సృష్టించింది. సూర్యాపేట జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. చివ్వెంల (మం)భీమ్లా తండాలో ఓ కుటుంబానికి చెందిన కుక్క కొద్దిసేపు కనబడకుండా పోయింది. దీంతో త‌మ‌ కుక్కను మీరే చంపారంటూ…సోదరుడి కుటుంబంతో గొడవకు దిగారు మ‌రో కుటుంబ సభ్యులు. కర్రలతో దాడులు చేశారు. ఈ క్రమంలోనే మీ కుక్క సంగతి మాకేం తెలుసంటూ ప్రతీకార దాడులకు దిగారు అవ‌తలి ‌కుటుంబం లోని సభ్యులు. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి.అక్కడే ఉన్న స్థానికులు ఇరువురికి సర్ది చెప్పి గొడవ సద్దుమణిగించారు. అంతలోపే కుక్క క్షేమంగా ఇంటికొచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది. కాగా ఈ ఘటనపై తమకు సమాచారం లేదంటున్నారు పోలీసులు.

Latest Updates