జగిత్యాల కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

జగిత్యాల కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

జగిత్యాల కలెక్టరేట్ ముందు రైతు ఐక్యవేదిక మహాధర్నా ఉద్రిక్తంగా మారింది. డీజిల్ మీద పోసుకుని ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రైతులను అడ్డుకున్నారు. పోలీసులు రైతులకు మధ్య తోపులాట జరిగడంతో  పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే దాకా ధర్నా విరమించేది లేదంటున్నారు రైతులు. 

అంతకు ముందు మినీ స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జిల్లా నలుమూలల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, చెరుకు ఫ్యాక్టరీ తెరవాలని డిమాండ్ డిమాండ్ చేస్తున్నారు రైతులు. యాసంగి పంటల సాగు విధానాన్ని వెంటనే ప్రకటించాలని కోరారు. మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వాలన్నారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. తూకం పేరిట మోసాలకు పాల్పడుతున్న రైస్ మిల్లు యజమానులపై చర్యలు తీసుకోవాలన్నారు రైతులు.