దారుణం.. బస్సు కిందపడి ఇంజినీరింగ్‌ అమ్మాయిలు మృతి

two-female-engineering-girls-died-in-an-accident-in-chennai-257731-2

మృతులు ఇద్దరూ రాజమండ్రి వాసులు

చెన్నై సిటీ నందనంలో దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. రద్దీగా ఉన్న రోడ్డుపై వేగంగా వస్తున్న బైక్.. అదుపుతప్పడంతో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు.

సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను బట్టి.. ప్రమాదం జరిగిన తీరు అయ్యో పాపం అనిపిస్తోంది. ఇద్దరు అమ్మాయిలు భవానీ, నాగలక్ష్మిలను బైక్ పై ఎక్కించుకుని ట్రిపుల్ రైడ్ చేస్తూ…. శివ అనే యువకుడు బైక్ వేగంగా వస్తున్నాడు. అతడికి ఎడమవైపున పక్కనే మరో బైక్ కూడా వస్తోంది. ఎదురుగా సడెన్ గా ఆటో కనిపించడంతో సింగిల్ గా వస్తున్న బైకర్ తన కుడిపక్కకు జరిగాడు. పక్కనే ఉన్న బైక్ ను ఢీకొట్టాడు. దీంతో.. ముగ్గురు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి పడిపోయింది. వెనకాలే వస్తున్న బస్సు.. కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో.. భవానీ, నాగలక్ష్మి నుజ్జునుజ్జై చనిపోయారు. బైక్ నడిపిన శివ తీవ్రంగా గాయపడ్డాడు.

రాజమండ్రికి చెందిన భవానీ, నాగలక్ష్మీ, శివ.. ఇంజనీరింగ్‌ చదివేందుకు చెన్నై వచ్చారు. మంగళవారం ముగ్గురూ ఒకే బైక్‌పై తాంబారంలోని కాలేజీకి వెళ్తున్న టైమ్ లో… ఈ ప్రమాదం జరిగింది. వీరి బైక్‌ను ఢీకొట్టిన వ్యక్తి కూడా గాయాలపాలయ్యాడు. ఈ ఇద్దరినీ తాంబారం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. శివ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Latest Updates