రసాయనశాస్త్రంలో ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్

వైద్య, భౌతిక శాస్త్ర రంగాల్లో విజేతలను ప్రకటించిన ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్  లేటెస్టుగా కెమిస్ట్రీలో అవార్డుకు ఎంపికైన వారి పేర్లను ప్రకటించింది. అమెరికాకు చెందిన జెన్నిఫర్ ఎ దౌడ్నా, ఇమ్మాన్యుయెల్లే చార్పెంటీర్ 2020కి గాను కెమిస్ట్రీలో నోబెల్ విజేతలుగా నిలిచారు. జన్యువులో మార్పులు, చేర్పులు చేసేందుకు వీలుగా వీరు ఓ కొత్త విధానానికి రూపకల్పన చేశారు.

ఓ ప్రాణి డీఎన్ఏ జన్యుపటాన్ని కత్తిరించడమే కాకుండా, దాన్ని నియంత్రించేందుకు జన్యు కత్తెర అనే విధానాన్ని ఆవిష్కరించారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రాణి డీఎన్ఏను మార్చడం ఇకపై ఎంతో సులువు. అది జంతువైనా, మొక్క అయినా సరే… అత్యంత కచ్చితత్వంతో తాము కోరుకున్న జన్యువును ఎంతమేర మార్చవచ్చో అంత వరకు మాత్రమే మార్పులు చేసుకోవడం సాధ్యమవుతుంది.

Latest Updates