బంజారాహిల్స్ లో డ్రగ్స్ కలకలం.. ఇద్దరు విదేశీయులు అరెస్ట్

హైదరాబాద్: డ్రగ్స్ అమ్ముతున్నారన్న సమాచారంతో ఇద్దరు విదేశీ వ్యక్తులను అరెస్టు చేశారు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. నగరంలోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో అబ్బో, సయ్యద్ అలీ అనే ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి డ్రగ్స్, ఒక ద్విచక్ర వాహనం, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ఇద్దర్నీ అమీర్ పేట్ ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. ఎక్సైజ్ అధికారులు వారిపై కేసు నమోదు చేసుకొని  రిమాండ్ కు తరలించారు.

Two foreigners have been arrested on information that drugs are being sold, according to Enforcement officials

Latest Updates