ఇద్దరికి కరోనా.. గాంధీ ఆస్పత్రి డాక్టర్ల తప్పుడు ప్రకటన

రాష్ట్రంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా బ్లడ్ శాంపిల్ రిపోర్టు వచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేసిన ఇద్దరు గాంధీ ఆస్పత్రి డాక్టర్లపై వేటు పడింది. రాష్ట్రానికి కరోనా వైరస్ వచ్చిందన్న వార్త వైరల్ కాగా… దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు సమాచారాన్ని అందించారన్న కారణంతో ఆ డాక్టర్ల వెంటనే విధుల నుంచి తొలగించాలని వైద్య ఆరోగ్య శాఖ సిఫార్సు చేసింది.

కరోనా లక్షణాల్లో ప్రధానమైన జలుబు, దగ్గు, జ్వరంతో  ఆస్పత్రికి వచ్చారే తప్ప… ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు గాంధీ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్, ఉన్నతాధికారులు. అయితే ఉన్నతాధికారుల అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడటంతో పాటు, కరోనాపై ప్రజల్లో ఆందోళన సృష్టించిన ఆ ఇద్దరు డాక్టర్ల ను విధుల నుంచి తొలగించి, వైద్య శాఖకు సరెండర్ చేశామని తెలిపారు. ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డులో చేరిన కొందరిని డిశ్చార్జ్ చేశామని, అనుమానితులకు కరోనా టెస్టులు చేస్తున్నట్లు చెప్పారు.అయితే ఇంతవరకూ రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు.

Latest Updates