హైదరాబాద్ లో రూ. 31లక్షల హవాలా డబ్బు సీజ్

హైదరాబాద్:  సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూద్బిగూడ దగ్గర.. హవాలా డబ్బులను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను.. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర 31లక్షల 26వేల నగదు, హోండా యాక్టివా సీజ్ చేశారు. నిందితులను సుల్తాన్ బజార్ పోలీసులకు అప్పగించారు.

రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మనీష్ తోష్నివాల్ గత కొంతకాలంగా నగరంలో హవాలా డబ్బును.. కమిషన్ పై కస్టమర్లకు అందజేసేవాడని తెలిపారు పోలీసులు. హవాలా డబ్బు తరలించేందుకు.. శాలిబండ ప్రాంతానికి చెందిన విష్ణును ఏజెంట్ గా నియమించుకున్నాడని చెప్పారు. వీరిద్దరూ లక్షల్లో హవాలా డబ్బును తరలిస్తున్నారనే సమాచారంతో.. నిఘా వేసి పట్టుకున్నారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.

Latest Updates