హైద‌రాబాద్ లో క‌రోనా బారిన‌ప‌డ్డ‌ డాక్ట‌ర్ల జంట‌

తెలంగాణ‌లో తొలిసారి ఇద్ద‌రు డాక్ట‌ర్ల‌కు క‌రోనా వైర‌స్ సోకింది. హైద‌రాబాద్ కు చెందిన డాక్ట‌ర్ల జంటతో పాటు మ‌రొక‌రి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు గురువారం ప్ర‌క‌టించింది రాష్ట్ర ఆరోగ్య శాఖ‌. ఈ ముగ్గురినీ ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తు్నామ‌ని, వారి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని తెలిపింది. ఇవాళ న‌మోదైన ఈ మూడు క‌రోనా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో క‌రోనా పేషెంట్ల సంఖ్య 44కు చేరింది. ఇందులో రాష్ట్రంలో తొలి పేషెంట్ అయిన సికింద్రాబాద్ యువ‌కుడు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు.

ముగ్గురూ విదేశీ ప్ర‌యాణం చేయ‌ని వ్య‌క్తులే…

ఇవాళ న‌మోదైన మూడు క‌రోనా కేసులూ లోక‌ల్ ట్రాన్స్ మిష‌న్ ద్వారానా వైర‌స్ బారిన‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురికీ విదేశీ ప్ర‌యాణం చేసిన ట్రావెల్ హిస్ట‌రీ లేదు. ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన కుత్బుల్లాపూర్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అలాగే దోమ‌ల‌గూడ‌కు చెందిన 41 ఏళ్ల డాక్ట‌ర్, ఆయ‌న భార్య (36)కు కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ దంప‌తులిద్ద‌రూ డాక్ట‌ర్లే కావ‌డం కొంత ఆందోళ‌నకు కార‌ణ‌మ‌వుతోంది. వీరిద్ద‌రూ హైద‌రాబాద్ లోని ఓ కార్పొరేట్ హాస్పిట‌ల్ లో ప‌ని చేస్తున్నార‌ని, ఇటీవ‌ల ఢిల్లీ, తిరుప‌తి ప్ర‌యాణాలు చేసిన‌ట్లు స‌మాచారం అందుతోంది. వారు ఈ ప్రాంతాల‌కు వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత ఆస్ప‌త్రిలో ట్రీట్మెంట్ చేసిన పేషెంట్ల వివ‌రాలు, వారు ఎవ‌రెవ‌రిని క‌లిశార‌న్న స‌మాచారం తెలుసుకుని అంద‌రినీ క్వారంటైన్ చేసే ప‌నిలో ప‌డ్డారు ప్ర‌భుత్వ అధికారులు.

Two hyderabadi Doctors affected by corona virus, total cases in Telangana reached to 44

Latest Updates