ఇవాళ రెండు IPL మ్యాచ్ లు

ఐపీఎల్ లో భాగంగా ఇవాళ కింగ్స్ లెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడనుంది. మరో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్.. కోల్ కతా నైట్ రైడర్స్ ను ఢీకొట్టనుంది. మొదటి మ్యాచ్ మొహాలీలో సాయంత్రం 4 గంటలకు పంజాబ్, ముంబై జట్ల మధ్య జరుగనుంది. మరో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల గ్రౌండ్ లో రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.

ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఆడిన పంజాబ్, ముంబై జట్లు..ఒక మ్యాచ్ లో గెలిచి మరోదాంట్లో ఓడిపోయాయి.  ఇవాళ జరిగే మ్యాచ్ లో గెలిచి సత్తా చాటాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. క్రిస్ గేల్, సర్ఫరాజ్, కేఎల్ రాహుల్, మయాంక్, పూరన్, కరన్ లాంటి ఆటగాళ్లతో పంజాబ్ స్ట్రాంగ్ గా ఉంది. ప్లేయర్లంతా మంచి ఫామ్ లో ఉండటం కింగ్స్ లెవన్ పంజాబ్ కు కలిసొచ్చే అంశం. అశ్విన్, షమీ, అంకిత్, ముజీబ్, కరన్ తో పంజాబ్  జట్టు బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది.

ఇప్పటికే రాయల్ చాలెంజర్స్  బెంగళూర్ పై విజయం సాధించిన ముంబై ఇండియన్స్.. మరో విక్టరీపై కన్నేసింది. డికాక్, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, సూర్యకుమార్, హార్థిక్ పటేల్, పోలార్డ్ లాంటి బ్యాట్స్ మెన్లతో పాటు బుమ్రా, మలింగతో బౌలింగ్ లోనూ పటిష్టంగా ఉంది ముంబై ఇండియన్స్ టీమ్.

ఇక మరో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ తలపడనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ ల్లో గెలిచిన కోల్ కతా మరోసారి గెలవాలనే పట్టుదలతో ఉంది. ఆండ్రీ రసెల్, రాబిన్ ఉతప్ప, నితీశ్ రాణా, దినేష్ కార్తీక్ తో పాటు బౌలర్లు సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, పీయూష్ చావ్లా,కుల్దీప్ యాదవ్ తో బౌలింగ్, బ్యాటింగ్  విభాగాల్లో స్ట్రాంగ్ గా ఉంది కేకేఆర్.

ఫస్ట్ మ్యాచ్ లో ముంబైని చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్..రెండో మ్యాచ్ లో చెన్నై చేతిలో చతికిల పడింది. ఓపెనర్ పృథ్వీ షా, శిఖర్ దావన్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ తో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. బౌలింగ్ లో అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, రబడ, అక్సర్ పటేల్ లాంటి ఆటగాళ్లతో రెండు విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది.ఇవాళ్టి మ్యాచ్ లో గెలవాలనే పట్టుదలతో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్.

Latest Updates