తమిళనాడులో ఇద్దరు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్

తమిళనాడులో మొదటి సారిగా ఇద్దరు జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకింది. దీంతో మీడియా ప్రతినిధుల్లో ఆందోళన  మొదలైంది. అలర్టైన అధికారులు ..వైరస్ బయటపడిన జర్నలిస్టులను ఐసోలేషన్‌కు తరలించారు. వారితో సన్నిహితంగా ఉన్నవారిని కూడా క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు.

చెన్నైలో ఓ తమిళ డైలీ పేపర్ రిపోర్టర్‌తో పాటు మరో తమిళ న్యూస్ చానెల్‌లో పని చేస్తున్న సబ్ ఎడిటర్‌కు పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో రిపోర్టర్‌ను రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో, సబ్ ఎడిటర్‌ను స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు అలందూరు పోలీస్‌ ఇన్స్పెక్టర్‌కు కూడా వ్యాధి సోకింది. ప్రజలు ప్రభుత్వాలతో అనుసంధానంగా ఉండే ముగ్గురికి కరోనా సోకడంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. ఈ ముగ్గురూ నివసించే ప్రాంతాల్లో అధికారులు శానిటైజేషన్ పనులు చేపట్టారు.

Latest Updates