న్యూయార్క్‌‌‌‌లో కాల్పులు.. ఇద్దరు మృతి

16 మందికి గాయాలు

రోచెస్టర్‌‌‌‌‌‌‌‌ (న్యూయార్క్): న్యూయార్క్‌‌‌‌లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. రోచెస్టర్‌‌‌‌‌‌‌‌ సిటీ గుడ్‌‌‌‌మ్యాన్‌‌‌‌ స్ట్రీట్‌‌‌‌లో శుక్రవారం అర్థరాత్రి లోకల్స్‌‌‌‌పై నిందితులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వాలెంటినా అనే యువతితో సహా మరొకరు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. పెన్సిల్వేనియా అవెన్యూ వద్ద  జరుగుతున్న పార్టీలో కూడా ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని దగ్గరలోని హాస్పిటల్స్‌‌‌‌లో చేర్చి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందిస్తున్నామని టెర్రె హాతె పోలీసులు చెప్పారు. కాల్పులు జరిపింది ఎవరు, ఎందుకు జరిపారనే విషయం ప్రస్తుతానికి తెలియలేదన్నారు.

For More News..

కరోనాతో ఇప్పటివరకు 41 మంది సైనికులు మృతి

నీళ్లు, కరెంట్ బిల్లుల్లో 50% డిస్కౌంట్

2 వేల నోట్లపై ఇంకా నిర్ణయం తీసుకోలే

Latest Updates