రోడ్డు ప్రమాదంలో బాబాయ్, అబ్బాయి మృతి

బైక్ ను బస్సు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.ఈ ఘటన కృష్ణా జిల్లా కంచికచర్లలో జరిగింది. పెనుగంచిప్రోలు కు చెందిన సీఏ విద్యార్థి రామ్ గోపాల్ పెళ్లి పనుల్లో భాగంగా నక్కలంపేట కు చెందిన తన బాబాయ్ కళ్యాణపు హరికృష్ణతో కలిసి బైక్ పై నక్కలంక పేట రోడ్డులో వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన అమృత సాయి ఇంజనీరింగ్ కాలేజీ బస్సు వారిని ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయానికి 30 మంది కాలేజీ విద్యార్ధులు బస్సులో ఉన్నారు.

సమాచారం అందుకున్న కంచికచర్ల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను కంచికచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Latest Updates