న‌ల్గొండ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం .. ఇద్ద‌రు మృతి

న‌ల్గొండ జిల్లా: క‌ట్టంగూర్ మండ‌లం ఐటిపాముల గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. శ‌నివారం మ‌ధ్యాహ్నం జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఆగి ఉన్న డీసీఎంని కారు ఢీ కొట్ట‌డంతో కారులో ఉన్న ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారని తెలిపాడు డీసీఎం డ్రైవ‌ర్. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Latest Updates