లారీని ఢీ కొట్టిన కారు…ఇద్దరి మృతి

శ్రీకాకుళం జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. రణస్థలం మండలం కోష్ట దగ్గర ఇవాళ(సోమవారం) తెల్లవారు జామున ఆగి ఉన్న లారీని ఓ కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కారు విశాఖ నుంచి పలాస వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్య లు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest Updates