వడదెబ్బతో ఇద్దరు మృతి

చిట్యాల/వర్ని, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని గరిమిల్లపల్లి కలికోట శివారులో గాదె రాజయ్య(72) అనే వృద్ధుడు ఆదివారం రాత్రి వడదెబ్బతో మృతి చెందాడు. రిటైర్డ్ సింగరేణి కార్మికుడైన రాజయ్య వెంకట్రావుపల్లిలోని చుట్టాల  ఇంటికొచ్చి కాలినడకన తిరిగి వెళ్తుండగా వడదెబ్బ తగిలి, చనిపోయాడు. సోమవారం రాజయ్యను గుర్తించిన స్థానికులు మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం చందూరులో ఉపాధి కూలీ బర్లసాయవ్వ (57) సోమవారం వడదెబ్బతో చనిపోయింది. చెరువులో పూడికతీత పనులు చేస్తుండగా అస్వస్థతకు గురయిన ఆమెను తోటి కూలీలు బోధన్‌ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలికి ముగ్గురు కూతుళ్ళు, కుమారుడు ఉన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒక్క మర్డర్ దాచడం కోసం 9 హత్యలు చేశాడు

V6 ఛానెల్ చొరవతో బెంగళూరు నుండి స్వ‌గ్రామానికి త‌ల్లీకూతుళ్లు 

నెటిజన్లు ఫిదా : బర్రె పగ తీర్చుకుంది.. ఆకతాయిల నడుం ఇరకొట్టింది

Latest Updates