కుంటలో పడి అన్నాతమ్ముళ్లు మృతి

ఈత సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. శుక్రవారం ఏకాదశి పండుగ బడి సెలవు కావడంతో ఆడుకునేందుకు వెళ్లిన అన్నాతమ్ముళ్లు నీటి కుంటలో పడి చనిపోయారు. మహబూబాబాద్​ జిల్లా కురవి మండలం  తిర్మలాపురానికి బతుకు దెరువుకు వచ్చి కూలిపని చేసుకుంటున్న చింతనూరి శ్రీను, హైమ దంపతులకు ఇద్దరు కొడుకులు. సూర్యతేజ(8), విశాల్(5) పక్కింటి ఈశ్వర్​తో కలిసి ఆడుకునేందుకు ఎర్రకుంటలోకి వెళ్లారు. ప్రమాదవశాత్తు సూర్యతేజ, విశాల్ నీళ్లలో మునిగిపోతుండగా ఈశ్వర్ రోడ్డుపైకి వచ్చి అక్కడున్నవారిని అప్రమత్తం చేసినా ఫలితం లేకపోయింది. బయటకు తీసేలోపే చనిపోయారు. ఇద్దరు కొడుకులు చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి.

Latest Updates