చాక్లెట్ ఆశచూపించి ఇద్దరు చిన్నారులపై అత్యాచారయత్నం

చాక్లెట్ కొనిస్తామని ఆశచూపి ఇద్దరు చిన్నారులపై ఆత్యాచారయత్నం చేశారు ఇద్దరు దుండగులు. హైదరాబాద్ లోని సైదాబాద్ కాలనీకి చెందిన 8,11 సంవత్సరాల ఇద్దరు చిన్నారులకు అదే కాలనీలో ఉంటున్న ఇస్లావత్ దస్రు, కేతావత్ మోతీలాల్ అనే యువకులు చాక్లెట్ కొనిస్తామని, సినిమాకు తీసుకెళ్తామని ఆశచూపించారు.

ఆ ఇద్దరు చిన్నారులను ఆదివారం బైక్ పై ఎక్కించుకుని..  సరూర్ నగర్ లోని గంగా థియోటర్ దగ్గర ఉన్న ఓ పాడుబడ్డ బంగ్లా లోకి తీసుకెళ్లి అత్యాచారం చేయసాగారు. దీంతో ఆ పిల్లలు ఏడవడంతో.. అటు వైపుగా వెళ్లే వాళ్లు పరిస్థితిని గమనించారు. ఆ ఇద్దరు యువకులను అడ్డుకుని కొట్టి…  సైబరాబాద్ పోలీసులకు అప్పగించారు. చిన్నారులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు పోలీసులు.

Latest Updates