కరెంటు షాక్ తో ఇద్దరు యువకులు మృతి

కరెంటు షాక్ తో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది. విజయరామరాజు పేట మరిడిమాంబ అమ్మవారి పండుగ సంధర్భంగా శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన ఏడిది జగదీష్, ముప్పిడి శ్రీను కలిసి జగదీష్ ఇంటిపై ఫ్లెక్సీ కడుతుండగా పక్కనే ఉన్న కరెంటు వైరు తగిలి ఇద్దరు మృతిచెందారు. అందివచ్చిన కొడుకులు చనిపోవడంతో ఇరు కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ భాస్కరరావు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Latest Updates