మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం

మాహేశ్వరం: మాయమాటలు చెప్పి మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. ఈ సంఘటన మహేశ్వరం మండలం దన్నారం గ్రామ సమీపంలో జరిగింది. దన్నారం గ్రామానికి వెళ్లేందుకు మహేశ్వరం బస్టాండ్ లో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఓ బాలిక(17) బస్సు కోసం వెయిట్ చేస్తుండగా ఇద్దరు యువకులు గమనించారు. బాలిక దగ్గరకు వెళ్లి బస్సు రావడానికి ఆలస్యం అయితుందని..తాము కూడా అదే గ్రామానికి వెళ్తున్నామంటూ మాయమాటలతో ఆ బాలికను బైక్ పై ఎక్కించుకున్నారు.

మార్గమధ్యలో ఆపి అత్యాచారానికి ఓడిగట్టి ఆ బాలికను అక్కడే వదిలి వెళ్లారు. దీంతో ఏడ్చుకుంటూ వచ్చిన ఆ బాలికను ఓ ఆటో ఆపగా ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. మంగళవారం ఉదయం ఆ బాలిక మాహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.

Latest Updates